Saturday, November 25, 2017

మరో క్షణం లో ఏం జరుగుతోందో... ఎత్తుకు పై ఎత్తులు.......

ప్రతి క్షణం....ఉత్కంఠత...
అనుక్షణం ఉద్విగ్నత....
మరో క్షణం లో ఏం జరుగుతోందో...
ఎత్తుకు పై ఎత్తులు.......
ఒకవైపు నేను....
మరో వైపు తను...
నా అంతరంగం నాకే తెలుసు....
అవతలివైపు నుంచి ఎలాంటి అడుగు పడుతుందో తెలియదు...
అయినా తెలుసుకునే ఆరాటం...
అవతలి చర్యకు నా ప్రతి చర్య...
అయినా ఒకసారి ఓటమి...
చిన్న బాధ...
ఒకింత కలవరింత...
అంతలోనే చిన్న విజయం...
కాసింత ఆనందం...
అయినా నేను పొంగిపోలేదు...
విజయం వైపు అడుగు వేస్తూనే ఉన్నా...
తను ఎలాంటి పోటీ ఇచ్చినా చెదరిపోను..
ధైర్యాన్ని కోల్పోను..
ఓడించాలన్న కసి తనది... 
గెలవాలన్న పట్టుదల నాది...
నా ఎదురుగా కూర్చుని పోరాడుతున్నది వ్యక్తి కాదు...
అది ఒక శక్తి....
అవును అది నా జీవితం...
అవును ....నాతో అనుక్షణం...
చదరంగం ఆడుతూ..
జీవితం ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది...
అయినా విజయ తీరాలను దాటాలన్న నా కసి ముందు ....
జీవితం ఆడుతున్న చదరంగం ఎంత...
అంతిమ విజేయురాలిని నేనే.
శుభ సాయంత్రం అందరికీ...

SEE MY PRACHINATELUGU.BLOGSPOT.IN


PRACHINATELUGU.BLOGSPOT.IN 

SEE http://prachinatelugu.blogspot.in/

http://prachinatelugu.blogspot.in/
PLEASE SEE MY OTHER POPULAR BLOG WITH 1 LAC 9K HITS .