ఒకప్పుడు...
మదరాసి గా వద్దని
మన వాసిని పెంచాలని
తెలుగు భాష పేరిట
ఉద్యమాలు చేశాము..రాష్ట్రాన్ని పొందాము ..
తరాల చరిత మనదని ..
తరగని ఘనత తెలుగుదని చెప్పి
పాటలెన్నో పడ్డాము ..ప్రాచీన హోదా పొందాము
సాహిత్య ప్రక్రియల్లో ..
అవధానాలు ,పద్య నాటక సొబగులు
తెలుగుకే సొంతమని..
సగర్వంగా చాటాము..స్వాభిమానము చూపాము
మరి ఇపుడు ...
తెలుగే వద్దని ..దానికి తెగులు పట్టిస్తున్నాము ..
పలకడానికి వెనుకాడుతూ..పాడె కట్టిస్తున్నాము ..
మహనీయుల కృషి మట్టిలో పూడ్చేస్తూ ..
సాహితీ వైభవాన్ని గంగలో కలిపేస్తున్నాము..
??????????????????????????????????????
????????????????????????????????????
???????????????????????????????????
ఇదేనా మన తెలుగోడి ఆత్మ గౌరవం ..??
ఇదేనా మన మాతృ భాష మమకారం ..??