తెలంగాణ సాహిత్య చరిత్ర ప్రాచీనత వేయి సంవత్సరాలు కాదు; మూడు వేల ఏండ్లు అని
ఆధారాలు లభిస్తున్నయి. తెలంగాణ ప్రజల చరిత్ర ముప్పై వేల ఏండ్ల నాటిదని
అంచనా వేసే అవకాశం కలుగుతున్నది. దశాబ్దాల తరబడి ఆంధ్ర భాషను ప్రామాణిక
భాష అని మనపై రుద్దిండ్రు. నిజానికి మనకు మన భాషే ప్రామాణిక
భాష! అలనాటి భాషకు, లిపికి దగ్గరగా ఉండేది మన భాషా లిపులే! ఆంధ్రులది ఆంధ్ర భాష;
తెలంగాణ వారిది తెలుగు భాష! ఇప్పుడు మన తెలుగు భాషను, చరిత్రను నూతన దృక్కోణంతో
ఆలోచన చేయాలె.