బ్రహ్మీ, సింహాళీ, పాళీ వంటి పదిహేను భాషలు నేర్చుకున్నా.
హైదరాబాద్‌లోని ప్యారడైజ్‌లో వెస్లీ స్కూల్‌లో పదవ తరగతి చదవుకుంటున్నప్పుడు.. పుస్తకాలంటే ఇష్టమేర్పడింది. ఒకసారి మా ఇంగ్లీష్ టీచర్ 1.25 పైసలిస్తే వాక్కులు అనే పుస్తకం తెచ్చుకొని చదివాను. అందులో ఉన్న కొన్ని మాటలు నన్ను అమితంగా ఆకర్షించాయి. ఇక అక్కడి నుంచి నా చేతికి డబ్బులు వస్తే చాలు.. అంజలీ టాకీస్ దగ్గరకు వెళ్లి పాత పుస్తకాలు తెచ్చుకొని చదివేవాడిని. అలా ఎక్కువ పుస్తకాలు చదవడంతో ఎక్కువ భాషలు నేర్చుకోవాలనే కోరిక కలిగింది. రష్యా,చైనా, జపాన్, ఫ్రెంచ్, బ్రహ్మీ, సింహాళీ, పాళీ వంటి పదిహేను భాషలు నేర్చుకున్నా.