6వ బట్టల
దుకాణం..
మాతాత గారిది
నల్లగొండలోని నెరడ గ్రామం. పేరు మూశం సీతారామయ్య. అప్పట్లో రజాకార్ల సమయంలో రాత్రివేళ తుపాకీ పట్టుకొని గస్తీ తిరిగేవాళ్లు. ఇట్లయితే.. రక్షణ ఉండదని ఏడు జాడీల నిండా వెండి నాణాలు నింపుకొని హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. మా నాన్నా లక్ష్మీనారాయణ, అమ్మ అండాళమ్మ. మేం నలుగురం అన్నదమ్ములం. నేను రెండోవాడిని. మేం పద్మశాలీలం. అందుకే ఇంట్లో అందరూ మగ్గాలు నేస్తారు. నల్లగొండలో నేసే ధోతులను విజయవాడ, తమిళనాడు నుంచి వచ్చి మరీ కొనుగోలు చేసేవారట ఒకప్పుడు. అందుకేనేమో నల్లగొండ చుట్టు పక్కన భూదాన్ పోచంపల్లి, మునుగోడు, సూర్యపేట ప్రాంతాలలో చేనేత కార్మికులు ఎక్కువగా స్థిరపడ్డారు