వేదాన్ని జీవన సంవిధానంగా మార్చుకున్న జాతి మనది.
వేటగాడిని వేదర్షి వాల్మీకిని చేసిన చరిత మనది.
వెన్నెముకను వజ్రాయుధంగా మలచిన యుక్తి మనది.
గడ్డిపోచను ఆత్మబలంతో అస్త్రంగా తీర్చిదిద్దిన శక్తి మనది.
భగవంతుడే జగద్గురువై 'గీత' మార్చిన రాత మనది.
శూన్యం(సున్నా)తో గణాంకాలు రాశులు పోసిన ఘనత మనది.
మూడుపదులకే ప్రపంచాన్ని మురిపించిన 'వివేకం' మనది.
పోపులడబ్బాలో ఆయుర్వేద సారాన్ని కూర్చిన నైపుణ్యం మనది.
అమ్మ చేతిలోనే అమృత వైద్యం అందించిన అద్భుతం మనది.