పెద్ద బాలశిక్ష తెలుగు జీవిత సత్యాల సంగ్రహం. ఆంధ్రదేశములోని పిల్లలు మొట్టమొదట తమ విధ్యాభ్యాసాన్ని పెద్ద బాలశిక్షతోనే ప్రారంభించేవారు
వర్తకానికి వచ్చి రాజ్యాధిపతులైన ఆంగ్లేయులు వారి కొలువులో రెవెన్యూ డిపార్టుమెంటులో చాలీ చాలని జీతాలతో పనిచేస్తూవున్న స్థానికులు అడ్డదారులు తొక్కి ధనార్జన కోసం అక్రమాలు అన్యాయాలు మోసాలు దగాలు తప్పుడు రికార్డులు సృష్టించడం మొదలైనివి చేస్తున్నారని గుర్తించారు. స్థానికులు విశ్వసనీయంగా ప్రవర్తించాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అని ఆలోచించారు. స్థానికుల విద్యావిధానంలో లోపం ఉందని తెలుసుకున్నారు. ఆనాటి మద్రాసు గవర్నరు 1822 జూలై 2వతేదీన ఒక యీ దస్తు కోరారు.అందులో ఇలా వుంది : '
“ రాజ్యాలను సంపాదించాక మనం భౌగోళికంగా సర్వేలు చేయించాము. దేశంలో పండే పంటల ఆరాలు తీశాము. వనరుల గురించి భోగట్టాలు రాబట్టాము. జనాభా లెక్కలు గుణించాము. అంతేగాని స్థానికుల విద్యావిధానం గురించి తెలుసుకోడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. ”